21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

గురజాడకు  గిరీశాల నివాళులు 

ఈ రోజు గురజాడ 150 వ జయంతి.
గురజాడని స్మరించు కోవడం సరే,
ఆయన ప్రతిపాదించిన విలువలను ఎవరు ఎంతవరకు అనుసరిస్తున్నారన్నది చూడాలి.
విలువలను పక్కన పెట్టి గురజాడ నామజపం చేస్తే సరిపోతుందా.
విగ్రహాలకు పూలమాలలు వేస్తే సరిపోయిందా.
మాటలకూ చేతలకూ పొంతన అక్కర లేదా.
భాష సేవ గురించి చాల మంది ఘనంగా చెప్పారు. కాని తెలుగు భాష మీద ఎవరికి ఎంత ప్రేమ ఉన్నదో తెలిసిందే. తెలుగు మీద మమకారం ఎలా ఉన్నదో ఎరిగినదే.
ఎందుకీ గిరీశం వేషాలు!

గిరీశాలు గురజాడకు నివాళులు ప్రకటిస్తున్నారు.
గురజాడ సేవలను గురించి కబుర్లు చెబుతున్నారు.
గురజాడ అడుగుజాడల్లో నడవాలని గిరీశాలు ప్రబోధిస్తున్నారు. 
ఎంత చిత్రం.
పాపం శమించు గాక.

గురజాడా!
వందేళ్ళ కాలంలో తెలుగు జాతి  ఎలాంటి అతి తెలివిని నేర్చుకున్నదో గమనించావా.
మంచిని మంచి మాటలతోనే ఏమార్చే  మంత్రాంగం బాగా నేర్చారు.
తెలుగుకు పాతర వేసి దేశభక్తి గురించి ఆలపిస్తున్నారు.
భాషాసేవ గురించి మురిపాలు పోతున్నారు.
ఈ నేర్పరితనం సాధించినందుకు  తమలో తాము మురిసిపోతున్నారు
అయినప్పటికీ గురజాడకు నివాళి ప్రకటించి ఆత్మల్ని నిద్ర పుచ్చుతున్నారు.
ప్రజలకు మరో మార్గం లేదు మరి! పాలకుల చిలకపలుకులని నమ్మినట్టే నటించాలి.
కాని, గురజాడ వెలుగు జాడల కోసం జల్లెడ పట్టి అంతటా వెదకాలి.
వొక చిన్న వెలుతురు మరక ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడాలి.
నగరాల్లో, పట్టణాల్ల్లో కాదు, పల్లెల్లో, పల్లె పొలిమేరల్లో, ఊరవతలి వాడల్లో గురజాడ కాలిబాటల జాడలు కనిపించవచ్చు.
అక్కడి దాక ప్రయాణించే మనసు ఉన్న వారికే గురజాడకు నివాళి ప్రకటించే అర్హత, అధికారం ఉన్నాయి.

4 కామెంట్‌లు:

  1. ఎంత నిజం చెప్పారు!! గురజాడ కంటే, గిరీశమే గ్లామరస్. దౌర్భాగ్యం.

    రిప్లయితొలగించండి
  2. బ్లాగులోకానికి స్వాగతం. అచ్చు మాధ్యమం పాఠకులు, అంతర్జాల పాఠకులు ఒకటి కాదు. అంతర్జాల పాఠకులకు అచ్చులో ఉండే మాధ్యమం అందుబాటులో ఉండదు. విదేశాలలో ఉండే తెలుగువారు తెలుగు సాహిత్యవార్తలు బ్లాగుల ద్వారానే తెలుసుకుంటారు. పాలపిట్ట బ్లాగు సాహితీ సౌరభాలతో ఉండగలదని ఆశిస్తాను.

    మిసిమి మాసపత్రిక వగైరాలు కినిగె ద్వారా లభ్యమవుతున్నాయి. పాలపిట్ట పత్రికను అచ్చుతో పాటు kinige.com ద్వారా కూడా ప్రచురిస్తే ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉండగలదు.

    Word verification అసౌకర్యంగా ఉంది. దీనిని తొలగించగలరు.
    cbrao
    Mountain View, California.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...