మనుషులు చేసిన దేవుడు
పొద్దుటే కాలనీలో బయటకు వచ్చా. పక్కనే వున్న సాయిబాబా గుడి ముందు నుంచే వెళ్ళాలి. ఇంటి నుంచి బయటికొచ్చి ఎక్కడికెళ్ళాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా సాయిబాబా గుడి ముందు నుంచే. కాకపోతే ప్రతిసారి నాకు ఒకింత విస్మయం, ఆశ్చర్యం. ఈ రోజు గుడి తలుపులు మూసి వున్నాయి. లోపల దీపారాధన, ఆరతి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా గురువారం గుడి చుట్టుపక్కల హడావిడి వుంటుంది. టూవీలర్స్ బారులు తీరి వుంటాయి. ఆ పక్కన ఈ పక్కన దయా హృదయుల కోసం కొందరు వేచి వుంటారు. మధ్యాహ్నం గురువారం అన్నప్రసాదం కోసం వచ్చేవారు వందలలో వుంటారు. ఇపుడు ఆ దృశ్యాలేవీ లేవు. ఒక్క బండి కూడా కనిపించలేదు. ఒకరిద్దరు భక్తులు వెళుతూ కొన్ని క్షణాలు ఆగి నమస్కరించుకుని సాగిపోయారు.
కరోనా నేపథ్యాన లాక్‌డౌన్ తరువాత పదిహేను రోజులకు అక్కడ కూరగాయల కోసం రైతు బజార్‌కు వస్తే మూసివున్న గుడి కనిపించింది. మరో పదిరోజుల తరువాత సాయంత్రం పూట బయటకి వచ్చినపుడు ఆరు గంటల వేళ లోపల ఆరతి జరగడం వినిపించింది. గేట్లు మూసివున్నాయి. పూజారుల స్వరాలు, సాయిబాబా గీతాలు వినిపించాయి. మరల ఈ రోజు పూజా కార్యక్రమాలు చెవిన బడ్డాయి.
సాయిబాబా నాకు ఎపుడూ ఒక విస్మయం. వందేళ్ళ కిందట వరకు మనుషుల మధ్యనే తిరుగాడిన మనిషి కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు. నేను నాకు తెలియకనే సాయిబాబా భక్తులనీ, ఆయనని ఆరాధించే వారిని చూస్తున్నాను, పరిశీలిస్తున్నాను. ఈ అసంకల్పిత పరిశీలన పరిపరివిధాల ఆలోచింపజేసేది.
కొన్నేళ్ళ కిందట వరకు గుడి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండేవారం. ఆ తరువాత నాలుగు ఇళ్ళ అవతల వీధిలోకి మా నివాసం మారింది. అయినప్పటికీ గుడి ముందు నుంచే రాకడ పోకడ. కొత్తలో ఇది గణేష్ టెంపుల్... క్రమక్రమంగా సాయిబాబా గుడిగా ప్రసిద్ది చెందింది. ఇతర సాయిబాబా ఆలయాలతో పోల్చుకుంటే ఇది చిన్న గుడి. దీనిలోనే వినాయకుడు, శివుడు, వాసవిమాత, లక్ష్మీదేవి కొలువు దీరారు. అయినప్పటికీ గుడిలోకి వచ్చేవారు తొలుత సాయిబాబానే పూజించేవారు. ఇదివరలో మొదట ఏ పూజయినా విఘ్నేశ్వరుడుకి చేసేవారు. కానీ ఇపుడు తొలుత భక్తులు తలచేది, కొలిచేది సాయిబాబానే. ఆ తరువాతే ఎవరయినా.
సాయిబాబా వందేళ్ళ కిందటివరకు మానవుల మధ్య తిరుగాడిన మనిషి. ఆయన సమకాలికులు, ఆయనతో గడిపిన వారు ఇపుడు లేకపోవచ్చు. కానీ ఆయనని దగ్గరగా చూసిన మనుషుల మాటలు విన్నవారి, చూసినవారితో గడిపిన మనుషులు అక్కడక్కడ ఉన్నారు. ఆయన మానవుడే అని చెప్పడానికి ఫొటోలు కూడా ఉన్నాయి. ఆయన గురించి రాసిన పుస్తకాలున్నాయి. తీసిన సినిమాలున్నాయి. నా పనులలో నేను వుంటూనే అనుకోకుండా సాయిబాబా గురించి హేమద్‌పంత్ రాసిన పుస్తకం చదివా. ఆ తరువాత ఎక్కిరాల భరద్వాజ రాసిన పుస్తకం చదివా. ఇంగ్లీషులో ఎం.వి. కామత్ రాసిన పుస్తకం, హిందూ పత్రిక సాయిబాబా మీద వెలువరించిన ప్రత్యేక సంచిక చదివా. సాయిబాబా శతవర్థంతి (2019) సందర్భంగా తీసుకొచ్చిన సంచిక ఇది. ఇవేవీ సాయిబాబా జీవితచరిత్రని సమగ్రంగా చెప్పలేదు. కానీ సాయిబాబా గురించి తెలుసుకోడానికి కొన్ని ఆధారాలు వీటిలో లభిస్తాయి. అలాగే కొందరు విదేశీయులు అక్కడక్కడ చెప్పిన అంశాలు, మరికొంత ఇంటర్నెట్ సమాచారం తరచి చూశా. ఇవేవీ సాయిబాబా వాస్తవ జీవితచరిత్రని చెప్పలేదు. మరాఠీ భాషలో ఎవరయినా ఏమైనా రాశారేమో తెలియదు. అక్కడి మిత్రులు ఎవరయినా చెప్పాలి. బాబాని దైవంగా ఆరాధించే అంశాల ప్రాధాన్యమే ఈ పుస్తకాలలో ఎక్కువ.
మనుషుల మధ్యనే బతికిన ఒక మనిషి కోట్లాది మందికి దేవుడు కావడం విస్మయం.
సాయిబాబా తనకు తాను దేవుడని చెప్పుకోలేదు. మహిమలున్నాయని చాటలేదు. ఒక సూఫీ ఫకీరులా జీవించాడు. అలాగే తన పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పలేదు. కులమతాలకు అతీతంగా ఉన్నారు. అతి మామూలు మనిషిగా గడిపాడు బతుకంతా. తనకు పూజలు పునస్కరాలు చేయాలని అడగలేదు.
సాయిబాబాని కొందరు ముస్లిం అన్నారు. ఇంకొందరు హిందూ అన్నారు. వాటితో ఆయనకు నిమిత్తం లేదు.
2014 తరువాత కొంతమంది సాయిబాబాని ఆరాధించడానికి వీల్లేదన్నారు. అది సాయిభక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఒక మైనారిటీ మతానికి చెందిన వ్యక్తి కాబట్టి పూజించవద్దనే మాటని ఎవరూ మన్నించలేదు. అలాగే ఇటీవల సాయిబాబా జన్మస్థలం గురించి ఒక వివాదం రేపారు. నిజానికి సాయిబాబా తను ఎక్కడ పుట్టాడో ఏనాడూ చెప్పలేదు. అందుకని ఆయన జన్మస్థల వివాదం అర్థరహితం.
కరోనా కాలంలో షిరిడిలోని ప్రధాన ఆలయమే కాదు దేశవ్యాప్తంగా వున్న వందలాది సాయిబాబా ఆలయాల ద్వారాలు మూసి వున్నాయి. కానీ ఆయన్ని ఆరాధించేవారు కవితలు, గేయాలు రాస్తున్నారు. సాయిబాబా అంటే నమ్మకం, విశ్వాసం ఉన్నవారు ఆయన పట్ల అచంచల ఆరాధనా భావంతోనే వున్నారు.
సాయిబాబా తెలుగువారికి ఒక ఆధ్యాత్మిక ఐకాన్.
అయితే సాయిబాబా జీవనగమనాన్ని పరిశీలిస్తే ఆయన జీవితమంతా ఒక ఫకీరులా, ఒక సంత్‌లా బతికారు. ఒక బైరాగిలానే జీవించారు. బోధలు, ప్రబోధాలు చేయలేదు. విలాస భవనాలలో నివసించలేదు. మనుషుల మధ్య అతి మామూలు మనిషిగా బతికాడు. అందుకే ఇతర బాబాలకు భిన్నం సాయిబాబా అనిపించింది. అందుకే సంత్ గాడ్గేబాబా గురించి సాంబశివరావు రాసినట్టు సాయిబాబా గురించి ఎవరయినా రాస్తే బాగుండనిపించింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి