యాంగ్ మో రాసిన ఉదయగీతిక నాకు అత్యంత ఇష్టమైన నవల. క్యాంపస్‌లో ఏ హాస్టల్‌లో ఉండగా దొరికిన నవల ఇది. నవల చేతికొచ్చి చదవడం మొదలెట్టాక ఆగకుండా చదివా. రాత్రి రెండు గంటలు దాటినా అలా చదువుతూ వుండిపోయిన సమయాలు ఇంకా గుర్తున్నాయి. ఎన్.వేణుగోపాల్ అనువాదం అద్భుతంగా వుంది. ఈ నవల చదివే సమయానికి వేణుగోపాల్ ఎవరో తెలియదు. క్యాంపస్‌లోకి అపుడే కొత్తగా వచ్చిన రోజులవి. ఇంకా పిడిఎస్‌యు, ఆర్ ఎస్ యు క్రియాశీలత కొనసాగుతున్న రోజులు. ఈ నవల ఉద్వేగ భరితంగా చదివించింది. ఈ నవలని కొన్నాళ్ళ కిందట తిరిగి ముద్రించారు. కానీ ఇపుడు ఆ నవలలోని స్ఫూర్తిని అందుకునే వారు ఎవరు? ఏమైనా పాఠకుడిని తీవ్రమైన ఉద్విగ్నతకు లోను చేసే మాంత్రిక శక్తి ఏదో ఈ నవలలో ఉంది. దానిని తెలుగులోకి తీసుకువచ్చిన వేణుగోపాల్ సృజన అంటే ఇప్పటికీ గౌరవం, ఇష్టం. ఈ కాలాన మరోసారి చదవాల్సిన నవల.
30, మే 2020, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
యాంగ్ మో రాసిన ఉదయగీతిక నాకు అత్యంత ఇష్టమైన నవల. క్యాంపస్‌లో ఏ హాస్టల్‌లో ఉండగా దొరికిన నవల ఇది. నవల చేతికొచ్చి చదవడం మొదల...
-
వొక మంచి తెలుగు వాక్యం కోసం రాజిరెడ్డి పుస్తకం చదవాలి. జర్నలిస్ట్‌లు గా ఎక్కువ కాలం ఉంటె సృజనాత్మకత దెబ్బ తింటుందని గతంలో అనేవాళ్ళు. అ...
-
అలరాస పుట్టిళ్ళు కథల పుస్తకం మరల మరల చదవాల్సిన పుస్తకం. రచయిత్రి కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి. వొకనాటి పల్...
-
మనుషులుగా ఆత్మగౌరవంతో జీవించే హక్కుకోసం బతుకంతా పోరాడిన అంబేద్కర్ విగ్రహాలు దళితులకు స్ఫూర్తిదాయకం. పాలకవర్గాలకు సింహస్వప్నం. అందుకే విగ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి