20, సెప్టెంబర్ 2012, గురువారం

మిత్రులారా,

మొదటి సారి బ్లాగ్ రాస్తున్నా. సమయం అర్థరాత్రి 12 గంటలు దాటింది.
వొంటరి గది. గది వొంటరితనానికి నేను తోడు.
ఏమి చెప్పాలన్నది అనుకోలేదు.
చెప్పడానికి ఎన్నో ఉన్నాయి.
2 రోజుల కిందట డాక్టర్ వి.చంద్ర శేఖరరావు గారి నవల 'నల్లమిరియం చెట్టు' చదివా.
కొత్త అభివ్యక్తి. వారి కథన రీతి నచ్చింది. నవల వేగంగా చదివించింది.
నవలకు చదివించడం మొదట అవసరమైన లక్షణం. వస్తువు గురించి చర్చ తర్వాత.
మాదిగ దండోరా ఉద్యమ నేపధ్యం లో అన్ని రకాల ఉద్యమాల లోని కపటవిలువలని చర్చకు పెట్టారు రచయిత.
తనదైన పద్దతిలో సన్నివేశాలను సృజించిన తీరు నాకు నచ్చింది.
నవల లోని పాత్రలు మన మనసులో నిలిచిపోయి ఆలోచనలకు తావు నిస్తాయి.
వారు రాసిన మరో నవల ఆకుపచ్చని దేశం చదువుతున్నా.

5 కామెంట్‌లు:

  1. సర్, వెల్కమ్.
    పత్రికల్లోకన్నా కొన్ని బ్లాగుల్లోనే చదవదగిన స్టఫ్ ఎక్కువ దొరుకుతోంది. మీదీ అలాంటి బ్లాగ్ కావాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  2. హమ్మయ్య..ఇన్నాళ్ళకు సంతోషం!
    హృదయపూర్వక స్వాగతం ఈ బ్లాగ్‌లోకానికి.

    రిప్లయితొలగించండి
  3. Welcome Gudipatigaru to the Blog world.

    Dr. Chandrasekhara Rao is one of the few best writers in Telugu we have these days.

    Hope to see more things from you both as editor and a critic.

    with very best regards

    రిప్లయితొలగించండి
  4. గుడిపాటిగారూ,
    వెల్‌కమ్. బ్లాగులోకానికి స్వాగతం. పాలపిట్ట సంపాదకీయాల వలెనే మీ బ్లాగు పోస్ట్స్ కూడా నాలాంటి చదువరులకు ఆసక్తికలిగిస్తాయని నమ్ముతూ... మీరు వీలైనంత ఎక్కువగా బ్లాగాలని కోరుతూ...
    కొల్లూరి సోమ శంకర్

    రిప్లయితొలగించండి

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...